మధుప్రియ ప్రేమ వివాహం
ఆదిలాబాద్, అక్టోబర్30(జనంసాక్షి):
వర్థమాన గాయని మధుప్రియ వివాహం అనేక ఉత్కంఠ పరిణామాల మధ్య తన ప్రియుడు శ్రీకాంత్‌తో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో వాసవీ గార్డెన్స్‌లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. శుక్రవారం ఉదయం మధుప్రియ తల్లిదండ్రులు, శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు కాగజ్‌నగర్ రూరల్ సీఐ రమేశ్‌బాబు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో మధుప్రియ తల్లిదండ్రులు కుమార్తె ప్రేమ వివాహానికి అంగీకరించినప్పటికీ వివాహాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. మధుప్రియ మాత్రం ప్రేమికుడితో నిర్ణయించిన ముహుర్తానికే పెళ్లి చేసుకుంటామని తెగేసి చెప్పడంతో పోలీసులు కూడా ఇక చేసేదేవిూలేక వారి నిర్ణయానికే వదిలేశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం మధుప్రియ, శ్రీకాంత్ వివాహం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన వర్థమాన గాయని మధుప్రియ, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి ప్రేమ వివాహానికి మధుప్రియ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. అయితే వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన వీరిద్దరు మాత్రం శుక్రవారం ఉదయం కాగజ్‌నగర్‌లో వివాహానికి ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి మధుప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్‌కు వాహనాల్లో వచ్చి మధుప్రియను బలవంతంగా తీసుకెళ్లేందుకు యత్నించారు. ప్రియుడి తరపు బంధువులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన కాగజ్‌నగర్ పోలీసులు ఇద్దరూ మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఏమైనప్పటికీ మధుప్రియ వివాహం మాత్రం ఆమె ప్రేమించిన శ్రీకాంత్‌తో ఘనంగా జరిగింది.
మైనారిటీ తీరడంతో ఇరు కుటుంబాల్లో చెప్పి వివాహ ఏర్పాట్లు చేసుకున్నారు. కెరీర్ విూద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని మదుప్రియ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిసినప్పటికీ ఆమె నిర్ణయం మారలేదు. ఆఖరికి తమ పెళ్లి రోజైన నవంబర్ 18న పెళ్లి చేస్తామని ప్రాధేయపడినా ససేవిూరా అంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
మొత్తవిూద వివాదాలకు, ఉదయం నుంచి కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ ముందుగా అనుకున్న విధంగానే సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో తన అబీష్టం మేరకు ప్రియుడు శ్రీకాంత్‌ను ఆమె వివాహం చేసుకుంది.