మధుమేహం వ‌ల్ల లైంగిక సామ‌ర్థ్య స‌మ‌స్య‌లు

ఖైరతాబాద్ : జులై 23 (జనం సాక్షి) లైంగిక జీవితంపై ఆసక్తి కోల్పోతున్న మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2020 ప్రారంభం నుంచి కనీసం 10 శాతం పెరిగిందని నగరంలోని ప్ర‌ముఖ మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన అమోర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. కొవిడ్ -19 మహమ్మారి, తదనంతర లాక్‌డౌన్ వ‌ల్ల నిశ్చల జీవనశైలి దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడానికి దారితీసిందన్నారు. ఇది పురుషులు, మహిళల లైంగిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఈ ప్రభావం గురించి అమోర్ ఆసుప‌త్రి ఇంటర్నల్ మెడిసిన్ విభాగం చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ ఉదయ్ లాల్ మాట్లాడుతూ డయాబెటిస్ మెల్లిటస్ ఉన్నవారి సంఖ్య క్ర‌మంగా పెర‌గ‌డాన్ని వైద్య‌వ‌ర్గాలు గ‌మ‌నిస్తున్నాయన్నారు.