మధ్యాహ్న భోజనానికి రాయితి సిలిండర్లు కొనసాగించండి

 

ఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రాయితీ సిలిండర్లు కొనసాగించాలని కేంద్ర మానవవనరుల అభివృద్దిశాఖ మంత్రి కపిల్‌సిబాల్‌ నెట్రోలియం మంత్రిత్వశాఖను కోరారు. రాయితీపై ఇచ్చే వంటగ్యాస్‌ పథకానికి ఇచ్చే సిలిండర్లపై పరిమితి విధిస్తే కేంద్రంపై అదనపు భారం పడుతుందని సిబాల్‌ అన్నారు. గతంలోలాగే రాయితీ కొనసాగించాలని పెట్రోలియంశాఖ మంత్రి జైపాల్‌రెడ్డికి రాసిన సిబాల్‌ పేర్కొన్నారు.