మనం ఇజ్రాయిల్‌-పాలస్తీనా కావద్దు

05-oct-02
– ఓంపూరీ

ముంబయి,అక్టోబర్‌ 3(జనంసాక్షి): ఉరీ ఘటన అనంతరం జరిగిన పరిణామాలపై ఎప్పటికప్పుడు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలనాటి నటుడు ఓంపురి ఈ విషయమై స్పందించారు. ఓ జాతీయ టీవీ ఛానల్‌ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌లోని పాక్‌ నటులకు మద్దతుగా సల్మాన్‌ చేసిన వ్యాఖ్యలను విూరు సమర్ధిస్తున్నారా? అని అడిగ్గా.. ”విూరు ఇండియా పాక్‌లను శతాబ్దాలుగా కొట్టుకున్న ఇజ్రాయిల్‌- పాలస్తీనాలా చూడాలనుకుంటున్నారా? ఇది దేశాలు విడిపోయే విషయం కాదు కుటుంబాలు విడిపోయే విషయం. మన దేశంలో 22 కోట్ల ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది. ఇప్పటికీ నేను పాక్‌ నటులతో కలిసి పనిచేస్తాను” అని చెప్పుకొచ్చారు. బారాముల్లా, ఉరీ దాడుల్లో చనిపోయిన సైనికుల గురించి ప్రస్తావించగా.. ”వారిని సైన్యంలో చేరమని మనం బలవంతం చేశామా? ఎవరు ఆర్మీలో చేరి ఆయుధాలు పట్టుకోమన్నారు?” అని షాకింగ్‌ సమాధానం ఇచ్చారు ఓంపురి.