మనకూ ఇజ్రాయిల్‌ తరహా ఐరన్‌ డోమ్‌

` ఆధునాతన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో
న్యూఢల్లీి(జనంసాక్షి): ఇజ్రాయిల్‌ వద్ద ఉన్న అత్యంత రక్షణాత్మకమైన ఆయుధం ఐరన్‌ డోమ్‌. ప్రత్యర్థులు వదిలే లాంగ్‌ రేంజ్‌ మిస్సైల్స్‌ను ఆ ఐరన్‌ డోమ్‌ అత్యంత కచ్చితత్వంతో అడ్డుకుంటుంది. ఇటీవల ఇజ్రాయిల్‌పై హమాస్‌ వేల రాకెట్లతో అటాక్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఐరన్‌ డోమ్‌ ఇజ్రాయిలీలకు చాలా రక్షణ ఇచ్చింది. వేల సంఖ్యలో రాకెట్లను ఆ డోమ్‌ వ్యవస్థ అడ్డుకున్నది. అయితే ఆ ఐరన్‌ డోమ్‌ తరహాలోనే ఇండియా కూడా ఓ లాంగ్‌ రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవసను డెవలప్‌ చేస్తున్నది.ప్రాజెక్టు కుష కింద ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను అభివృద్ధి పరుస్తున్నారు. డీఆర్డీవో ఆ పనులు వేగవంతంగా చేస్తోంది. ఐరన్‌ డోమ్‌ రేంజ్‌ కేవలం 70 కిలోవిూటర్లు మాత్రమే. కానీ భారత ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ రేంజ్‌ మాత్రం 350 కిలోవిూటర్ల దూరం ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ కొత్త ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వస్తే, అప్పుడు భారత అమ్ములపొది మరింత పకడ్బందీగా తయారుకానున్నది. 2028`29 సంవత్సరం వరకు ఆ డిఫెన్స్‌ వ్యవస్థను తయారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్టీల్త్‌ ఫైటర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌, డ్రోన్లు, క్రూయిజ్‌ మిస్సైళ్లును సుమారు 350 కిలోవిూటర్ల రేంజ్‌లో ఆ వ్యవస్థ అడ్డుకుంటుందని అంచనా వేస్తున్నారు.చాలా దూరం నుంచి శుత్ర మిస్సైళ్లను, విమానాలను అడ్డుకునేందుకు ప్రాజెక్టు కుష కింద మూడు అంచెల డిఫెన్స్‌ సిస్టమ్‌ను డెవలప్‌ చేస్తున్నారు. సుమారు 2.5 బిలియన్ల డాలర్ల ఖర్చుతో ఆ ప్రాజెక్టు చేపట్టారు. వైమానిక ఉపద్రవాలను అడ్డుకునేందుకు బలమైన వాయు రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కొందరు అధికారులు చెప్పారు.