మనీలాలో మరో జర్నలిస్టు హత్య

మనీలా: గుర్తుతెలియని దుండగుల చేతిలో ఓ క్రైమ్ జర్నలిస్టు హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన ఫిలిపిన్స్ రాజధాని మనీలాలో గడిచిన రాత్రి చోటుచేసుకుంది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అలెక్స్ బాల్కొబా(56) అనే జర్నలిస్ట్‌ను అతని కుటుంబ సభ్యులు నడిపే వాచ్ రిపేర్ దుకాణం వద్దే దారుణంగా కాల్చి చంపారు. పీపూల్స్ బ్రిగాడ్ అనే టాబ్లాయిడ్‌లో అలెక్స్ క్రైమ్ జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాదిలో జర్నలిస్టు హత్యకు గురికావడం ఇది రెండోసారి.

ఫిలిపిన్స్‌లో 2010 నుంచి ఇప్పటి వరకు 34 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. జర్నలిస్టుల హత్య కేసుల్లో ఇప్పటివరకు 10 మంది అనుమానితులను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. రిపోర్టర్లకు ప్రమాదకరమైన దేశాల్లో ఫిలిపిన్స్ అత్యంత ప్రమాదకర దేశంగా ఉంది.

జరగడం ఇది రెండోసారి. బెనిగ్నోన్ అక్వినో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. 1986 నుంచి జరిగిన వ్యక్తిగత కక్ష్యలు, వాణిజ్య సంబంధ అంశాల లావాదేవీల కారణంతో హత్యలు చోటుచేసుకుంటున్నట్లు నేషనల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెల్లడించారు.