మనీ లాండరింగ్ కేసులో జగన్‌కు ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ : కడప పార్లమెంటు సభ్యుడు, వైస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంటు నోటీసులు అందజేసింది. మనీలాండరింగ్ కేసులో డిసెంబర్ 17న విచారణకు రావాలన్నది ఆ నోటీసుల సారాంశం. అప్పిలేట్ అథారిటీ విచారణ జరుగుతుంది. ప్రస్తుతం విచారణకు విచ్చిన జగతి సంస్థల ఆడిటర్ విజయసాయి రెడ్డికి కూడా నోటీసుల అందజేసిన ఈడీ అధికారులు డిసెంబర్ 20న మళ్లీ రావాలని ఆదేశించినట్లు సమాచారం. జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా తరపున విజయసాయిరెడ్డి హాజరవుతారు. ఇదిలాఉండగా ఎమ్మార్ ఎంజిఎఫ్‌కూ ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. మనీ లాండరింగ్ చట్టం కింద డిసెంబర్ 5న విచారణకు రావాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ ఈడీ అప్పిలేట్ అథారిటీ ఆదేశించింది.