మనోహరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం రద్దు

మనోహరాబాద్ ప్రెస్ క్లబ్  పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దుర్వినియోగం చేస్తున్నందున కార్యవర్గం ను మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు రద్దు చేస్తున్నట్లు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చందుగౌడ్ తెలిపారు.ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కార్యవర్గం లోని కొందరు సభ్యులు ప్రెస్ క్లబ్ పేరు అడ్డుపెట్టుకొని క్లబ్ నిబంధనలకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సందర్బంగా ప్రెస్ క్లబ్ సభ్యుల మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు ప్రెస్ క్లబ్ కార్యవర్గం ను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ రోజు నుండి ప్రెస్ క్లబ్ పేరు అడ్డుపెట్టుకొని ఎలాంటి అవినీతి అక్రమ వసూళ్లకు పాల్పడినా ప్రెస్ క్లబ్ కి ఎలాంటి సంబంధం లేదని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలకు పిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశం లో ప్రెస్ క్లబ్ సభ్యులు మరియు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.