మన ఊరు మనబడి పనుల ప్రగతిపై సమీక్ష
నిర్మల్ బ్యూరో, జూన్25,జనంసాక్షి,,, శనివారం జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అధ్యక్షతన జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో మన ఊరు మనబడి పనుల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు .
జిల్లాలో మొదటి విడతగా ఆమోదం పొందిన 260 పాఠశాలల్లో ఇప్పటివరకు 85 పాఠశాలలో గ్రౌండ్ పనులు మొదలయ్యాయని, మిగతా అన్ని పాఠశాలలోనూ పనులు ప్రారంభించి, త్వరగా పూర్తిచేయాలని తెలియజేశారు. జిల్లాలో మొత్తం 260 పాఠశాలలో 30 లక్షల లోపు 177 పాఠశాలలు 30 లక్షలకు పైబడి 82 పాఠశాలలు ఉన్నాయన్నారు. 30 లక్షల లోపు పనులను ఎస్ ఎం సి లు సర్పంచుల సహకారంతో పూర్తి చేయాలని సూచించారు. 30 లక్షల పైబడిన వారికి టెండర్ల ద్వారా పనులు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలోనూ 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించి పాఠశాల యొక్క దశ మార్చే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకు వచ్చిందని తెలిపారు.
ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేసి, గడువు లోగా ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి దశ యొక్క ఫోటోలను అప్లోడ్ చేసి, ప్రగతిని నివేదించాలని తెలిపారు. అలాగే ఎం జి ఎన్.ఆర్ ఈ జి ఎస్ కింద ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు నిర్మించాలని తెలిపారు.
ఈ కార్యక్రమo లో అడిషనల్ కలెక్టర్ హేమంత్
బో ర్కడే, జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, ఎంపీడీవోలు, ఎం ఆర్ వో లు, మండల విద్యాధికారులు, మండల ప్రత్యేక అధికారులు ఈ ఈ లు, ఏ ఈ లు, విద్యా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులందరూ పనులను పర్యవేక్షించి పనులు త్వరితగతిన పకడ్బందీగా పూర్తి అగునట్లు చూడాలని అధికారులను ఆదేశించారు.