మన ఊరు – మన బడి,మన బస్తీ – మన బడి క్రింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి ,
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ మన ఊరు – మన బడి,మన బస్తీ – మన బడి పాఠశాలలకు సంబంధించి చేపట్టిన పనుల ప్రగతి పై అర్&బి టి.ఎస్.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి., పి.అర్. ఈ ఈ.లు,ఎం.ఈ.ల తో మండలాల వారీ గా సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు – మన బడి,మన బస్తీ – మన బడి కింద జిల్లాలో మొదటి విడతగా ఎంపిక చేసిన 517 పాఠశాలల్లో మంజూరు చేసిన పనులు వెంటనే గ్రౌండింగ్ చేయాలని,మంజూరు కాకుంటే పనులు మంజూరు చేయాలని ఆదేశించారు.మండలం ల వారీగా పాఠశాలల్లో పనులు ప్రగతి పై డి. ఈ. ఓ.,సంబంధిత శాఖ ఈ ఈ లు,ఎం.ఈ. ఓ.లు, ఏ. ఈ.లు,కాంట్రాక్టర్ లతో టాస్క్ వారీగా సమీక్షించి ప్రతి మండలం కు రెండు మోడల్ పాఠశాలల్లో పనులు పూర్తి చేసి దసరా నాటికి పెయింటింగ్ వేయుటకు సిద్దం చేయాలని ఆదేశించారు టాయి లెట్ లు, కిచెన్ షెడ్ లు,ప్రహరీ గోడ నిర్మాణం పనులు ఈ.జి.యస్ కింద మంజూరు చేసి వెంటనే పూర్తి చేయాలని అన్నారు.జిల్లాలో ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో వారం రోజుల్లో పనులు చేపట్టాలని,నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.మంజూరు చేసిన వాటిని ఆన్ లైన్ లో అప్ డేట్ చేయాలని అన్నారు. పాఠశాలలలో చేపట్టిన వాటిని పూర్తైన పనుల వారీగా బిల్లులు వెంట వెంటనే సమర్పించాలని,నిధుల కొరత లేదని అన్నారు.పాఠశాలలు షిఫ్టింగ్ అవసరం వుంటే డి. ఈ. ఓ.,సంబంధిత ఈ ఈ తనిఖీ చేసి కారణం వివరిస్తూ నివేదిక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు పంపాలని,సమీక్షించి నిర్ణయం తీసుకుని ప్రతి పాదనలు పంపిస్తామని అన్నారు. రెంటెడ్ భవనాలు ఉన్న చోట ఎస్టిమేట్స్ పూర్తి చేసి ప్రతిపాదనలు పంపాలని అన్నారు.
ఈ సందర్భంగా మండలాల్లో పాఠశాల వారీగా పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఎఫ్.టి. ఓ.లు జెనరేట్ చేయాలని,పాఠశాలల వారీగా కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్, విద్యుత్ సౌకర్యం, సంప్, టాయ్లెట్ లు, అదనపు తరగతుల నిర్మాణం, పనుల ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జడ్.పి.సి.ఈ. ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, సి.పి. ఓ బాల శౌరి, జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి,అర్ &బి ఈ ఈ నరేందర్ రెడ్డి,పి.అర్. ఈ ఈ లు తిరు పతయ్య, మాధవి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.