మన బిడ్డల్ని వెనక్కు రప్పిచండి

1

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి):

నేపాల్‌లో భూకంపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ బిడ్డలని సురక్షితంగా రప్పించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణభవన్‌ అధికారులు, విదేశాంగశాఖ సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంఓ అధికారుల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నేపాల్‌లోని భారత రాయబారి రంజిత్‌ రే తో సంప్రదింపులు జరిపి పరిస్థితిని అధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఖాట్మండులో 28 మంది తెలంగాణ టూరిస్టులు, భరత్‌పూర్‌ మెడికల్‌ కాలేజీలో కూడా దాదాపు 40 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వారిని సురక్షితంగా తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రస్తుతం అక్కడ వారికి పునరావాసం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.