మమ్మల్ని ఆదేశించే హక్కు ఇవరికీ లేదు : ఎర్రబెల్లి
హైదరాబాద్ : తెలంగాణపై తమ నిర్ణయం చెప్పాలని ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణపై తమ పార్టీ తరపున చెప్పాల్సింది ప్రజలకు చెబుతామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఎర్రబెల్లి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. సోనియా నివాసం ముందు ధర్నాకు తెరాస ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తెదేపా తుది హెచ్చిరిక ఇచ్చే అధికారం ఎవరికీ లేదని అన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన జగన్‌పై కేసు ఎత్తివేశారు. తెలంగాణ లాయర్లపై కేసులు పెట్టారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎంతో రహస్యంగా పనులు చేయించుకునే తెరాస నేతలు విమలక్క విషయంపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. వరంగల్‌లో సీసీఐ చేతులు ఎత్తివేసిందని, దళారుల ఇష్టారాజ్యంతో పత్తి రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.