మయన్మార్‌లో కంపించిన భూమి
యాంగాస్, షిల్లాంగ్, సిడ్నీ: భారత సరిహద్దుల్లోనే మయన్మార్ ప్రాంతంలో ఆదివారం భూమి కంపించింది. దీంతో మయన్మార్‌తో పాటు ఈశాన్య భారతంలోని లు పట్లణాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. మయన్మార్‌లోని రెండో ప్రధాన పట్టణమైన మాండలలకు 215 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప లేఖిని 5.7గా నమోదైనట్లు అమెరికా వాతావరణ కేంద్రం, 5.8గా మయన్మార్ భూకంప అధ్యయన సంస్థ వెల్లడించాయి. ఈటానగర్, గౌహతి, అగర్తలా, కోహిమా, ఇంఫాల్ తదితర ఈశాన్య భారత పట్టణాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని అధికారులు వెల్లడించారు.