మరిన్ని ‘మీ-సేవ’లు
– అక్రమ హోర్డింగులు తొలగించాలి
– మంట్రి కేటీఆర్ ఆదేశం
హైదరాబాద్,జులై 22(జనంసాక్షి): ఇంటింటికి ఇంటర్‌నెట్ అందించడంతో ఐటిని విస్తరిస్తామని ఐటిశాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ప్రభుత్వ సేవలు సత్వంరం ప్రజలకు చేరితేనే లక్ష్యం నెరవేరినట్లని అన్నారు. ఇంట్లో కూర్చుని నెట్ ద్వారా సౌకర్యాలు పొందే వీలుండాలని అన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు వర్క్‌షాప్‌లో ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రతి పౌరుడికి అవకాశం ఇవ్వాలనేది వర్క్‌షాప్ లక్ష్యమన్నారు. ఇంటింటికీ ఇంటర్‌నెట్ ద్వారా మారుమూల గ్రామాన్ని ప్రపంచంతో కలపడం సాధ్యమవుతుందని తెలిపారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ వంటి నినాదాలు ఈ ప్రాజెక్టు ద్వారా పూర్తవుతాయని చెప్పారు. విద్య, వైద్య, ప్రభుత్వం సేవల వంటి రంగాలకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వెల్లడించారు. ప్రజలు అత్యుత్తమ సౌకర్యాలు అందుకునేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చెప్పారు.
నగరంలో ప్రమాదకరంగా మారిన ¬ర్డింగ్‌లు
జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ ¬ర్డింగ్‌లు, బ్యానర్లను తొలగించే విసయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడపడితే అక్కడ ఇష్టం వచ్చినట్లుగా ¬ర్డింగ్‌లు ఏర్పాటుచేయడం, అవి గాలి దుమారాలకు కూలి పోవడంతో ఇక ఉపేక్షించరాదని నిర్ణయించారు. ఇష్టం వచ్చినట్లుగా ఏర్పాటైన ¬ర్డింగ్‌లను తొలగించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశించారు. అవి ఎక్కడున్నా ప్రమాదాలకు కారణం కనుక తక్షణం వాటిని తొలగించాలన్నారు. జన్మదినఆలు, జయంతుల పేరిట పెద్ద ఎత్తున ఇకముందు ¬ర్డింగ్‌లకు అనుమతించ రాదన్నారు. తనతోపాటు ఎవరి జన్మదినాలకు కూడా మినహాయింపు లేదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలకు అక్రమ ¬ర్డింగ్‌లు కూలి ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ ¬ర్డింగ్‌లు తొలగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న అనధికార ¬ర్డింగ్‌లు, బ్యానర్లు లేకుండా చూడాలని ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. అక్రమ ¬ర్డింగ్‌ల విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని మంత్రి సూచించారు. ఇదిలావుంటే నగర రోడ్లపైనా కెటిఆర్ దృష్టి సారించి ఆదేశాలు జారిచేసిన సంగతి తెలిసిందే. సమస్యాత్మకంగా మారుతోన్న ప్రాంతా ల్లో బీటీ, వాటర్ ప్రూప్, ప్లాస్టిక్ రోడ్లు వేసే అంశాన్ని పరిశీలించనున్నట్టు చెప్పారు. నగరంలో రహదారులను ఐదారు జోన్లుగా విభజించి కన్సల్టెన్సీలతో శాస్త్రీయ సర్వే నిర్వహిస్తామన్నారు. పైపులైన్ నెట్‌వర్క్, కేబుళ్లు ఇతర మౌలిక వసతులు కల్పించిన అనంతరం రోడ్లు నిర్మించేలా ప్రణాళికలు ఉంటాయన్నారు. కనీసం 15సంవత్సరాలు రోడ్డు పాడ వకుండా శాస్త్రీయ విధానాలు అవలంభిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దశల వారీగా రోడ్ల పున:నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నాలాల నుంచి వచ్చే వ్యర్థాలను మళ్లించినా.. ఇప్పటికీ హుస్సేన్ సాగర్‌లోకి మురుగు చేరుతుందని, అలాంటప్పుడు పనులు చేసి ప్రయోజనం లేకుండా పోతుందని మంత్రి అభిప్రాయపడ్డారని గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. వచ్చే ఆరునెలల్లో సాగర్‌ను మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎం డీఏ, వాటర్‌బోర్డు, పీసీబీ అధికారులకు సూచించినట్టు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ రేపిన వివాదం రాజ్యసభలో ఎపి ప్రత్యేక ¬దా బిల్లుకు అడ్డుపడేలా చేసింది. ఇదంతా అధికార బిజెపి వ్యూహంలో భాగంగా సాగిందన్న విమర్శలు వచ్చాయి. మాన్‌పై చర్య తీసుకోవాలంటూ బీజేపీ సభ్యులు పోడియం వద్ద నిరసనకు దిగారు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక ¬దా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. నినాదాల ¬రు తారస్థాయికి చేరింది. ఎవరేం మాట్లాడుతున్నదీ వినబడకపోవడంతో డిప్యూటి ఛైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో కేవీపీ బిల్లు ఈ వారం చర్చకు రాకుండా పోయింది. దీంతో మళ్లీ వచ్చే శుక్రవారం వరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రతీ శుక్రవారం నాడు మాత్రమే ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు వస్తుంది. వచ్చే శుక్రవారం నాడు కూడా రాకపోతే నవంబర్ 5 న మళ్ళీ రావాలి. కేవీపీ బిల్లుపై చర్చ జరిపాకే మరొక ప్రైవేట్ మెంబర్ బిల్లును టేకప్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా అధికార పార్టీ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ ఆనందర్ శర్మ , సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయపరమైన హక్కులను కేంద్రం అమలు చేయడం లేదన్నారు. భగవంత్ మాన్ ఇష్యూను అడ్డుపెట్టుకుని బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాన్ని దాటవేస్తోందని, ఇది బీజేపీ కప్పదాటు వ్యవహారాన్ని తెలియ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.బిల్లును ఎలాగైనా పాస్ చేయించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఆ మేరకు విప్ కూడా జారీ చేసింది. రాజ్యసభ బలాబలాల రీత్యా చూస్తే ఈ బిల్లుపై ప్రభుత్వ ఓటమి ఖాయం. దీని వల్ల ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేకపోయినా అది సర్కార్‌కు ఇబ్బందికరం కానుంది. మాన్ వ్యవహారంతో ప్రత్యేక ¬దా కోసం ప్రైవేటు బిల్లు రాజ్యసభలో చర్చకు రాలేదు. కేవీపీ ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌కు కాంగ్రెస్ పట్టుబట్టింది. కాగా ఆప్ ఎంపీ భగవంత్ మాన్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఆందోళనల మధ్య సభలో గందరగోళం నెలకొంది. సభా కార్యక్రమాలను బీజేపీ అడ్డుకుంది. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ¬దా బిల్లు చర్చకు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.