మరుగొడ్ల నిర్మాణాలకు పెద్దపీట

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో మరుగొడ్ల నిర్మాణం సాగుతోందని జిల్లా గ్రావిూణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌ రాఠోడ్‌ అన్నారు. ప్రభుత్వం ఇందుకు నిధులు వెచ్చిస్తోందని అన్నారు. జిల్లాకేంద్రమైన

ఆదిలాబాద్‌ పట్టణాన్ని బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ బుద్ధప్రకాశ్‌ ఎం.జ్యోతి ఇచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణంలో పలు కుటుంబాలకు మరుగుదొడ్లులేవని అలాంటి వారిని గుర్తించి తక్షణం మరుగుదొడ్ల నిర్మాణానికి

పనిచేయాలన్నారు. హరితహారం కింద నాటిన మొక్కలను పరిరక్షించేందుకుగాను, నర్సరీల ద్వారా కొత్తమొక్కల పెంపకానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నాటిన మొక్కలను రక్షించే బాధ్యత గ్రామపంచాయితీలదేనని అన్నారు. అలాగే వచ్చేయేడుకు పి/-పటినుంచే ప్రణాళిక సిద్దంగా ఉందన్నారు. పట్టణంలో ప్లాస్టిక్‌వాడాకాన్ని పూర్తిగా నిషేధించాలని, విక్రయాలు జరిపేవారిపై జరిమానాలు విధించాలన్నారు.