మరోసారి సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులు
జమ్ము : కాశ్మీర్ వద్ద భారత్, పాక్ సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పులకు పాల్పడింది. దాంతో భారత సైన్యం ఎదురు కాల్పులు జరపాల్సివచ్చిందని ఆధికారులు తెలిపారు. వూంఛ్ జిల్లాలోని కృష్ణ ఘాటీ సెక్టార్‌లో శనివారం రాత్రి పదిగంటలు దాటాక మొదలైన ఈ కాల్పులు అర్థరాత్రి దాటేవరకు కొనసాగాయి. పాకిస్థానీ సైన్యంలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. జనవరి 8 నుంచి పాకిస్థాన్ ఇలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది ఏడోసారి.