మరో వివాదంలో .. నేను పక్కా లోకల్‌

` కేసులకు భయపడను
` నాపై కేసును సీఎం దృష్టికి తీసుకెళ్తా
` ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): మరోవైపు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్‌ హుడా లేఔట్‌ ఘటన నేఫథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే విూడియాతో మాట్లాడుతూ… రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్‌ అని పేర్కొన్నారు. నందగిరి హిల్స్‌ హుడా లేఔట్‌ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని ్గªర్‌ అయ్యారు. ఈ వ్యవహారంలో అధికారులకు ప్రివిలేజ్‌ నోటీసులు ఇస్తానని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాదు.. సీఎం రేవంత్‌ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. హైడ్రా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్‌ గురుబ్రహ్మ నగర్‌లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పార్క్‌ స్థలం అని చెప్పి ఈవీడీఎం వాళ్లు పెద్ద ప్రహరీ గోడ కడుతున్నారని.. బస్తీ వాసులకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. గోడ కట్టొద్దన్నందుకే ఈవీడీఎం అధికారులు తనపై కేసు పెట్టారని దానం తెలిపారు. హైదరాబాద్‌ను హైడ్రా అధికారులకేవిూ రాసివ్వలేదని.. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై 190 కేసులు ఉన్నాయని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పష్టం చేశారు.
రంగంలోకి ‘హైడ్రా’
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్‌ డిజాస్టర్‌, రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ కు అవసరమైన ఆఫీసర్లు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. 259 మంది ఆఫీసర్లు,సిబ్బందిని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక్క ఐపీఎస్‌, ముగ్గురు గ్రూప్‌ 1 స్థాయి ఎస్పీలు,5 మంది డిప్యూటీ స్థాయి సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు,33 మంది సబ్‌ ఇన్‌ స్పెక్టర్లు,5 మంది రిజర్వ్‌ ఇన్‌ స్పెక్టర్లు,12 మంది రిజర్వ్‌ ఎస్‌ఐలు, 101 మంది కానిస్టేబుల్స్‌,72 మంది హోంగార్డ్స్‌,6 మంది అనలిటికల్‌ ఆఫీసర్లను కేటాయిస్తూ మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దాన కిషోర్‌ ఆదేశాలు జారీ చేశారు. 3500 మంది అవసరమని హైడ్రా కమిషనర్‌ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైడ్రాకు ఛైర్మన్‌ గా సీఎం రేవంత్‌ రెడ్డి, కమిషనర్‌గా రంగనాథ్‌ ఉన్నారు. 2,500 చదరపు కిలో విూటర్ల పరిధి ఉన్న హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటవుతుందని రంగనాథ్‌ వెల్లడిరచిన సంగతి తెలిసిందే.. ఈ పోలీస్‌ స్టేషన్‌ ద్వారానే ఎస్వోటీ ఏర్పాటు చేసి కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు పెడ్తామన్నారు. హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉందని చెప్పారు. పార్క్‌ స్థలాలను కాపాడే కాలనీ సంఘాలకు మద్దతిస్తామన్నారు. హైడ్రాకు మొత్తం 3,500 మంది సిబ్బంది అవసరమని, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. హైడ్రా కింద అసెట్‌ ప్రొటెక్షన్‌తోపాటు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ కూడా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో 72 టీమ్స్‌?ను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇదిలావుంటే గ్రేటర్‌లో ఆపరేషన్‌ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్‌ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉప్పల్‌ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించ నున్నట్లు తెలిపారు. ఉప్పల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ మందుముల పరమేశ్వర్‌ రెడ్డి సోమవారం కమిషనర్‌ రంగనాథ్‌ను కలసి ఉప్పల్‌ నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి వివరించిన విషయం తెలిసిందే. దీంతో రంగనాథ్‌ మంగళవారం ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీన్‌ మార్‌ మల్లన్న, పరమేశ్వర్‌ రెడ్డి వజ్రేష్‌ యాదవ్‌, ఉప్పల్‌ కార్పొరేటర్‌ రజిత పరమేశ్వర్‌ రెడ్డితో కలిసి నల్లచెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను, ఆక్రమణలు పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. చెరువులను, నాలాలను, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు.