మలిదశ ఉద్యమం చేపడతాం : రాగుల
ఆదిలాబాద్, డిసెంబర్ 9 : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు భారతీయ జనాతా పార్టీ మలిదశ ఉద్యమం చేపడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాగుల రామ్‌నాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం, డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం పట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మూడు రోజుల పాటు పోరుదీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో ఆదివారం నాడు చేపట్టిన పోరుదీక్షలో రామ్‌నాథ్‌తో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కేంద్రం రాష్ట్ర ఏర్పాటులో చేస్తున్న జాప్యన్ని, మోసపూరిత ప్రకటనలను ప్రజలనను గమనిస్తున్నారని వారన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పార్టీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ పోరుదీక్షలు ఈ నెల 11వ తేదీ వరకు జరుగుతాయని తెలంగాణ వాదులు ఈ పోరుదీక్షలకు తరలివచ్చి సంఘీభావం తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.