మల్కాజిగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

మల్కాజిగిరి,జనంసాక్షి,ఆగస్టు 6
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో దేశంలోనీ 508 స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  మల్కాజిగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 26.7 కోట్ల రూపాయలను కేటాయించారు.మల్కాజిగిరి రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు,మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్,కార్పొరేటర్లు శ్రావణ్ కుమార్, రాజ్యలక్ష్మి,మేకల సునీత యాదవ్, ప్రేమ్ కుమార్,విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.
ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత మల్కాజిగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుందని దీనివలన మల్కాజిగిరి ప్రజలకు ఎంతో సౌలభ్యం  లభిస్తుందని పేర్కొన్నారు.

తాజావార్తలు