మల్దకల్ మండలంలో ముగిసిన పల్లె ప్రగతి
మల్దకల్ జూన్18(జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం లో లో ఈ నెల 3వ తేదీ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం ముగిసింది.గ్రామ పంచాయతీలలో పదిహేను రోజులపాటు పారిశుద్ధ్య కార్మికులు,మురికి కాలువలు, చెత్తాచెదారం ,డ్రైనేజీను శుభ్రచారు.పాత ఇళ్లను పడగొట్టి చదునుచేశారు. గ్రామాలలో పల్లె ప్రగతితో పరిశుభ్రంగా ఉంచారు. పాలిథిన్ కవర్లు లేకుండగా మొత్తము కాల్చివేశారు. క్రీడా ప్రాంగణాలలో గుర్తించి పనులు ప్రారంభించారు.పదిహేను రోజులపాటు గ్రామ కార్యదర్శులు సర్పంచులు ఎంపిటిసిలు స్పెషల్ ఆఫీసర్లు గ్రామ ప్రజలు సహకారంతో గ్రామాలు అంతటా పల్లె ప్రగతి తో కళకళలాడుతున్నాయి. అధికారులు ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు నివేదికలు పై అధికారులకు నివేదించారు. మండలంలోని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ,డిపిఓ శ్యాంసుందర్,డీఎల్పీవో వెంకటరెడ్డి, డిఆర్డిఎ పి డి ఉమాదేవి,గ్రామాలలో పర్యటించారు.