మల్లాపూర్ లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్:6 కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని పాత వాడ మాదిగ సంఘం ( అంబేద్కర్ సంఘం ) ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్ పి టి సి ఆకుతోట రాజేష్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్ పి టి సి ఆకుతోట రాజేష్, కొత్తూరి రవి దాస్,నూతిపెళ్లి రాజం, బండారి రమేష్,ఆకుతోట నర్సయ్య,కాశవత్తుల భుచ్చయ్య, కొత్తూరు శేఖర్, ఎర్ర భూమయ్య , బదినపల్లి ప్రేమ్ కోడూరి బిక్షపతి, ఆకుతోట భరత్, తెడ్డు నరేష్,ఆకుతోట రంజిత్, ఆకుతోట వినోద్, నూతిపల్లి అశోక్, చింతకుంట శేఖర్, మాట్ల ఆంజనేయులు, మాట్ల దినేష్, మాట్ల రాజేష్, కొమ్ము ప్రభాకర్, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు