మల్లాపూర్ లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

మల్లాపూర్ ఆగస్టు 19 (జనంసాక్షి)  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవన్ని పురస్కరించుకొని,మల్లాపూర్ మండల కేంద్రం లో మండల ఫొటో, వీడియో గ్రాఫర్స్ (మల్లాపూర్ కెమెరా క్లబ్ ) ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ దురిశెట్టి శ్రీనివాస్ గారు అనారోగ్యం రీత్యా ఇంటికే పరిమితం కావడంతో కెమెరా క్లబ్ సభ్యులు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వేల్పుల రాజు మాట్లాడుతూ తేలంగాణ ఉద్యమం లో ఫోటో గ్రాఫర్స్ కీలక పాత్ర పోషించారని, తెలంగాణా ప్రభుత్వం ఏర్పడి ఇన్ని మాసాలు గడుస్తున్నా ఫోటోగ్రాఫర్లను ఆర్థికంగా ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీజన్ ఉన్న లేకున్నా వృత్తినే నమ్ముకొని చాలామంది ఫొటోగ్రాఫర్లు సరైన ఉపాధి లేక జీవిస్తున్నారని,ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలని, సబ్సిడీ ద్వారా ఫోటోగ్రాఫర్స్ ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కెమెరా క్లబ్ అధ్యక్షుడు వేల్పుల రాజు, ఉపాధ్యక్షుడు సంగ రవి, క్యాషియర్ కొండవత్తిని రాజేష్, ప్రధాన కార్యదర్శి దురిశెట్టి అశోక్, మిడిదొడ్డి మల్లేష్, పెంబి మహేష్, వీర రఘు నందన్, వాసం మధుకర్, మామిడాల నవీన్, మామిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.