మహనీయుల విగ్రహాల ముందు నివాళులు
వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 14(జనం సాక్షి)
కరీమాబాదులోని అంబేద్కర్ భవన్ దగ్గర మహనీయుల విగ్రహాల ముందు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ . బిఆర్ అంబెడ్కర్ 1956 14న నాగపూర్ దీక్ష భూమిలో బౌద్ధ దమ్మ దీక్ష తీసుకున్న రోజును మహనీయుల విగ్రహాల ముందు భగవాన్ గౌతమ బుద్ధుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజారత్న బొమ్మల కట్టయ్య గారాల విగ్రహాలకు పూలమాలల అలంకరించి శ్రద్ధాంజలి ఘటించారు ఇట్టి కార్యక్రమం బిఎస్ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొమ్మల్ల అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో జరిగింది అక్టోబర్ 14 నాగపూర్ లో డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ బౌద్ధం స్వీకరించి అది జరిగినప్పటికీ ఇప్పటికీ 66 ఏళ్లు ఆయన తనతో పాటు ఆరు లక్షల మంది అనుచరులని అన్యాయులని బౌద్ధంలోకి మార్చారు వారంతా ఇప్పుడు నియోబుద్ధిష్టులుగా గుర్తింపు పొందారు. ధర్మాన్ని మనుషులుగ వారి హక్కులను వారు సాధించుకున్నప్పుడే సమ సమాజం నిర్మాణం జరుగుతుంది అని హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించెను అని నాసిక్ దగ్గర 13 అక్టోబర్ 1935 నాడు యూల కాన్ఫరెన్స్లో అంబేద్కర్ తన చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించాడు తన బౌద్ధ దీక్షతో అన్నింటికీ ఆయన సరైన సమాధానం చెప్పాడు దేశ ప్రజలకు దశరద్దేశం చేశారు బౌద్ధం ప్రపంచాన్ని మానవ సమాజంగా తీర్చిదిద్ద గలదు అన్నది అంబేద్కర్ భావన తను బౌ ద్దం స్వీకరించి దేశ వాసులకు ఒక మంచి సందేశం ఇచ్చారని ఒక మంచి మార్గాన్ని చూపించారని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉందా హుందాగా ప్రకటించారు మానవ హక్కులు ఆత్మగౌరవం బౌద్ధంతో దక్కుతాయని ఎందుకంటే బౌద్ధం బౌద్ధంలో సమానత్వం ఉంది స్వేచ్ఛ ఉంది అది నైతికత మీద ఆధారపడి ఉంది పైగా దైవ భావన లేదు అది ఒక మనిషి మనసు మీద ఆధారపడి ఉంది అది నిజమైన జీవన విధానం అని గ్రహించి బౌద్ద్ధంలో ఉందని గ్రహించి బౌద్ధ దీక్ష తీసుకొని ప్రపంచాన్ని బౌద్ధమయం మార్చే దిశగా బాబాసాహెబ్ ప్రయత్నం చేసి ముందుకు వెళ్లారు. కాబట్టి ఆ రోజు నుండి ఈరోజు వరకు ప్రతి ఒక్క అంబేద్కర్ వారసులు అందరూ కూడా అక్టోబర్ 14 న ఎంతో పవిత్ర దినంగా ధర్మదీక్ష దినంగా పాటిస్తూ గొప్ప కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ బౌద్ధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే దిశగా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇట్టి కార్యక్రమం లో అంబేద్కర్ భవన్ అధ్యక్షులు కడారి కుమార్ మాత రమాబాయి అంబేద్కర్ పరపతి సంఘం అధ్యక్షులు ఎరుకల మహేందర్ కోశాధికారి నీలం మల్లేశం మహిళా నాయకురాలు తరాల రాజమణి గారు అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి జక్కుల రాజు తరాల రవితేజ స్వామి నవీన్ నరేందర్ సిద్ధార్థ పాల్గొన్నారు