మహబూబాబాద్ యంపీ సోదరి మాలోతు కవిత ను సన్మానించిన మాజీ ఆర్డీవో వడ్త్య శక్రు నాయక్ మాజి మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్
మునుగోడు ఉప ఎన్నికల్లో ముష్టిపల్లి యంపిటిసి పరిధికి ఇంచార్జీగా వ్యవహరించి టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి దోహదపడినందుకు మహబూబాబాద్ యంపీ సోదరి మాలోతు కవిత గారిని శాలువా కప్పి సన్మానించారు దేవరకొండ మాజీ ఆర్డీవో శక్రు నాయక్ మరియు మాజి మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవర్టు రాజగోపాల్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కొరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు తెర తీశాడు. మరో వైపు కేంద్రంలో ఉన్న బిజేపి పార్టీ దేశ రాజకీయాలలో కుటిల నీతిని అమలుచేస్తు రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితులలో వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీకి ఒక సవాలు. ఐనప్పటికీ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లుగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేలాది మంది తమ తమ వ్యక్తిగత జీవితాలను వదులుకొని సైనికులుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలను, వాటి ఫలితాలను ప్రజల ముందు ఆవిష్కరించారు. ఊరు, వాడ, తండా, గూడెం అంటూ ఏదీ వడలిపెట్టకుండ మునుగోడులోని ప్రతి ఓటరును కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిచవలసిన ఆవశ్యకతను వివరిస్తూ అద్భుతంగా పని చేశారు. అదేవిధంగా ప్రత్యర్థుల విద్వేషాలను తట్టుకొని టిఆర్ఎస్ కార్యకర్తలు నిలిచిన తీరు రేపటికి చరిత్రకు ఒక పాఠం కాగలదని అన్నారు. కేంద్ర సర్కారు, రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుతంత్రాలు చేసినా అంతమ విజయం టిఆర్ఎస్ పార్టీనే వరించిందని ఆనందం వ్యక్తం చేశారు. మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాలలో కేసీఆర్ గారి ప్రస్థాన ఆవశ్యకతను బలంగా నిరూపించబడిందని అన్నారు. ఇప్పుడున్న దేశ రాజకీయ అస్థిరత్వమయిన పాలన కేసీఆర్ గారిని జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు ఉపకరిస్తుందని అన్నారు. అదే విధంగా కేసీఆర్ గారిని భవిష్యత్ దేశ ప్రధానిగా చూసే కాలం ఎంతో దూరంలో లేదని ఆశాభావం వ్యక్తంచేశారు