మహాగ్యాస్‌పైప్‌లైన్‌కు శంకుస్థాపన
తుర్కుమెనిస్థాన్,డిసెంబర్13,(జనంసాక్షి):భారత ఉప రాష్ట్రపతి హవిూద్ అన్సారీ, పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, తుర్కుమెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బంగులి బెర్డిముహందెవో నలుగురు కలిసి మహాగ్యాస్‌పైప్ లైన్ పనులను ప్రారంభించారు. 7.6 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించనున్న 18 వందల కిలోవిూటర్ల టాపి (తుర్కమెనిస్థాన్, అఫ్ఘస్థాన్, పాకిస్తాన్, ఇండియా) గ్యాస్ పైప్‌లైన్‌కు శంకస్థాపన జరిగింది. ఇవాళ తుర్కుమెనిస్థాన్ రాజధానికి 311 కిలోవిూటర్ల దూరంలో ఉన్న మెరి నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ఉప రాష్ట్రపతి హవిూద్ అన్సారీ, పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, తుర్కుమెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బంగులి బెర్డిముహందెవో నలుగురు కలిసి గ్యాస్ పైప్‌లైన్ పనులను ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన బటన్‌ను నొక్కి పనులను ప్రారంభించారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీని ద్వారా భారత్‌లోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల అవసరాలు తీరనున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు 2019 డిసెంబర్‌కల్లా పూర్తి కావొచ్చని తుర్కమెనిస్థాన్ అధ్యక్షుడు తెలిపారు. తమ దేశం కావాల్సినంత సహజ వాయువును అందజేయగలదని తెలిపారు. టాపి ప్రాజెక్టు ద్వారా రోజుకు 90 మిలియన్ల క్యూబిక్ సామర్థ్యం గల గ్యాస్‌ను 30 సంవత్సరాలపాటు సరఫరా చేయగలమన్నారు.