మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ

ఖానాపురం సెప్టెంబర్ 15జనం సాక్షి
మండలంలోని వజినేపల్లి గ్రామంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే స్కూల్లో ను డిప్యూటీ డిఎంహెచ్వోడాక్టర్ ప్రకాష్ గురువారం  సందర్శించారు.ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూనులిపురుగు నివారణ దినోత్సవం  సందర్భంగాపిల్లలందరూ తప్పనిసరిగా మాత్రలు నమిలిమింగాలని అన్నారు.
భోజనానికి ముందు మరుగుదొడ్లను వాడిన తర్వాత తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని,
పరిశుభ్రమైన మరుగుదొడ్లను వాడాలని,సూచించారు.
బూట్లు లేదా చెప్పులు ధరించాలని,
బాగా ఉడికిన ఆహారాన్ని తినాలని,
గోర్లను శుభ్రంగా చిన్నవిగా ఉంచుకోవాలని అన్నారు.
సురక్షితమైన పరిశుభ్రమైన నీటితో కూరగాయలను పండ్లను కడిగిన తర్వాతనే వాడాలని అన్నారు.
ఆల్బెండజోల్ మాత్రం సురక్షితమైన అని వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తప్పనిసరిగా 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలువాడవచ్చు అని అన్నారు .
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అరుణ్ కుమార్,
మాట్లాడుతూఖానాపురం
 మండలంలోని34 ప్రభుత్వ పాఠశాలలో, మూడు కళాశాలలో 45 అంగన్వాడి సెంటర్లలో
ఒక ప్రైవేట్ స్కూల్లో సుమారు 7216 మందికి నట్టల నివారణ గోలీల మింగించడం జరుగుతుందని తెలిపారు
 ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మరియు స్టాఫ్ నర్స్ స్రవంతి.వైద్య సిబ్బంది
ఫార్మసిస్ట్ సత్యం,సూపర్వైజర్ యాక స్వామి
ఏఎన్ఎం జ్యోతి,హెల్త్ అసిస్టెంట్
భాస్కర్ ,భద్రు నాయక్జ్యోతి, భారతమ్మ,లలిత తదితరులు పాల్గొన్నారు