మహాధర్నాకు రండోయ్ !

దండంబెట్టి గెలిచిన నాయకుడు

దండతో గుబులు రేపుతున్నడు

నమ్మి అధికారం  కట్టబెడితే

నగుబాటు చేసి నవ్వుతున్నడు

పెద్దన్నలా ఉద్దరిస్తరనుకుంటే

పీతురి గద్దలా పొడుస్తున్నడు

371 శాసనాస్త్రం ఎక్కుపెట్టి

వేతన జీవుల వేధిస్తున్నాడు

స్థానికత హక్కు హరిస్తున్నడు

ఇదేమిటని నిలదీస్తే…

విద్వేష విషం విరజిమ్మి

ఉక్కు పాదం మోపుతుంది

ఇంకా …

నిలబడి కలబడకుంటే

ఉద్యోగ భద్రత భగ్నమే

మనుగడ భూస్థాపితమే

అందుకే

దండుగట్టి దండోర మోగించి

మహా ధర్నాకు కదలండోయ్

సంకల్పిస్తూ….సంఘటిస్తూ..

సమర యాత్రకు సాగండోయ్

బాటలు వేస్తూ..బారులుదీస్తూ

భారి ర్యాలీగా బైలుదేరండోయ్

రక్తం మరిగిస్తు..పిడికిలి బిగిస్తు

గడీల పునాది కదిలించండోయ్

ప్రచండిస్తూ…..ప్రతిధ్వనిస్తూ

ప్రభుతకు దడ పుట్టించండోయ్

కదం తొక్కుతు…కవాతుజేస్తూ

నేతల గుండెలపై దరువేయండోయ్

స్థానికత హక్కులు సాదించండోయ్

            “”””””””””

 ( ఫిబ్రవరి 9 న జరిగే ఉపాధ్యాయ

మహాధర్నాకు మద్దతుగా…)

               కోడిగూటి తిరుపతి

               Mbl no :9573929493