మహానాడులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
హైదరాబాద్ : గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబునాయడు, నందమూరి హరికృష్ణ , బాలకృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నేతలు భారీ కేక్‌ను కట్ చేశారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని గత 15 ఏళ్లుగా తెదేపా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.