మహానాడులో తెలంగాణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు : హరీశ్‌రావు
హైదరాబాద్ : తెదేపా నిర్వహించిన మహానాడులో తెలంగాణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెరాస నేత హరీశ్‌రావు విమర్శించారు. మహానాడులో తెలంగాణపై ప్రవేశ పెట్టిన తీర్మానం ప్రజలకు అయోమయానికి గురిచేసిందని అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని మహానాడులో ఎందుకు డిమాండ్ చేయ లేదని ఆయన తెలంగాణ తెదేపా నేతలను ప్రశ్నించారు.