మహానాడు బుర్రకథను తలపిస్తోంది
– నాలుగేళ్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– బీజేపీతో కలిసి ¬దాను భూస్థాపితం చేశారు
– ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యి
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి
చిత్తూరు, మే29(జనం సాక్షి) : తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు సమావేశాలు బుర్రకథను తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగిడేందుకే మహానాడు సమావేశాలు ఏర్పాటుచేశారని అన్నారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు తెలుగు ప్రజలకు ఏమి చేశారో చెప్పే దమ్ము, ధైర్యం లేదని దూషించారు. మహానాడు వేదికపై ప్రజలను కించపరిచే విధంగా మట్లాడుతుంటే బాబు ముసిముసి నవ్వులు నవ్వుతారా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేశ్ మహానాడులో వంటల గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రత్యేక ¬దాపై చంద్రబాబు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పార్థసారధి దుయ్యబట్టారు. బీజేపీతో కలిసి ప్రత్యేక ¬దాను భూస్థాపితం చేశారని, నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాబు పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తన తప్పిదాలను ప్రజల నుంచి దృష్టి మరల్చడంలో బాబు దిట్టని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు. మళ్లీ వైస్ పాలన రావాలంటే జగన్ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఆ మేరకు 2019లో జగన్‌కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.