మహారాష్ట్రలో పసుపు సాగు,మార్కెటింగ్ విధానాలను పరిశీలించిన కేసముద్రం మార్కెట్ కమిటీ

కేసముద్రం సెప్టెంబర్ 23 జనం సాక్షి / కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గ్రామాల్లో పసుపు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతుండడం,అదే రీతిలో ధర కూడా పడిపోతుండడంతో పసుపు సాగు విస్తీర్ణం పెంపు, ఇతర ప్రాంతాల్లో లభిస్తున్న ధరలు పరిశీలించడానికి  మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణరావు నేతృత్వంలో మార్కెట్ పాలకమండలి సభ్యులు,కార్మిక,కర్షక వ్యాపార ప్రతినిధులతో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలో పసుపు విక్రయానికి పేరెన్నికైన సాంగ్లీ వ్యవసాయ మార్కెట్, ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించడానికి ఈనెల 20న స్టడీ టూర్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత శుక్రవారం మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ ను ప్రతినిధి బృందం సందర్శించింది.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పసుపు ఎగుమతికి పేరుగాంచిన సాంగ్లీ మార్కెట్ తోపాటు,పసుపు ప్రాసెసింగ్ యూనిట్లను,పసుపు పంట సాగు,విక్రయాలను పరిశీలించారు.సాంగ్లీ ప్రాంతంలో రాజపురి అనే పసుపు విత్తనం అత్యధిక దిగుబడి ఇస్తుందని ఇక్కడి రైతులు తెలిపారు.అలాగే సాంగ్లీ మార్కెట్ కు సీజన్లో ప్రతిరోజు 20వేల బస్తాలకు పైగా పసుపు విక్రయానికి వస్తుందని, రైతుల పంట ఉత్పత్తిని పాలిష్ చేసి విక్రయానికి తెస్తే,నేరుగా వ్యాపారులు ఖరీదు చేస్తారని మార్కెట్ కార్యదర్శి మహేష్ చవాన్ వివరించారు.ఫిబ్రవరి మాసం నుంచి పసుపు దిగుబడులు వస్తాయని,రాజపురి పసుపు విత్తనం కోసం ఆ సమయంలో ఇక్కడికి వచ్చి విత్తనం తీసుకోవచ్చని తెలిపారు.సాంగ్లీ మార్కెట్ రైతులకు అందిస్తున్న సేవలు వివరించారు.ఈ కార్యక్రమంలో సాంగ్లీ మార్కెట్ అధికారులు పటేల్ జమేదార్ మావిడి,యాదవ్, మణి, సాంగ్లీ మార్కెట్ వ్యాపార ప్రతినిధులు మహేందర్, దిలీప్ అర్వడే పాల్గొన్నారు. ఈ స్టడీ టూర్ లో కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ బంటు ఉపేందర్, డైరెక్టర్లు మీరా హుస్సేన్, ముదిగిరి కట్టయ్య, దరావత్ రమా రవీందర్,గుజ్జునూరి మణిరత్నం,సంకేపళ్లి జనార్దన్ రెడ్డి,బచ్చు పరమేశ్వర్, కేసముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, మార్కెట్ సూపర్వైజర్ రాజేందర్, రైతు సంఘాల ప్రతినిధులు బొబ్బాల యాకుబ్ రెడ్డి, సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ తోకల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వోలం ప్రభు కిరణ్, కార్మిక సంఘాల ప్రతినిధులు కంచె వెంకన్న,మంద భాస్కర్,దడువాయి సంఘం ఉపాధ్యక్షుడు మంగీలాల్, కుమార్ సంఘం సలహాదారు బైరు శ్రీనివాసులు,మార్కెట్ సిబ్బంది ముత్తయ్య  తదితరులు పాల్గొన్నారు.