మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు
కొండమల్లేపల్లి అక్టోబర్ 1 (జనం సాక్షి ): కొండమల్లేపల్లి పట్టణంలో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు కాత్యాయిని దుర్గాదేవి నవదుర్గాల్లో ఆరవ అవతారం, నవరాత్రుల ఆరవ రోజున అశ్వియుజ శుద్ధ షష్టినాడు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు భక్తులు అమర కోశం పార్వతి దేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయిని షాక్తేయంలో అమ్మవారిని శక్తి, దుర్గ, భద్రకాళి,చండీకల, అపర అవతారంగా భావిస్తారు కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు స్కంద పురాణం ప్రకారం సింహ వాహిని అయిన అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతి దేవికి సహాయం అందించింది నవరాత్రుల సమయంలో అమ్మవారిని భారత దేశమంతా అమ్మవారిని అది పవిత్రతో పూజిస్తారు కొండమల్లేపల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం రోజు అమ్మవారికి విరాళాలు అందజేసిన అందరికీ సుమారు 30 మంది దంపతులకు సన్మానాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పూరే జగన్, ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటేశ్వర్లు, కోశాధికారి చందా ధనుంజయ, ఆర్యవైశ్య సంఘం పట్టణ ఉపాధ్యక్షులు అంకి శెట్టి శేఖర్, నేలంటి వెంకటేశ్వర్లు, బూరుగు హరి, బచ్చు వెంకటేశ్వర్లు, చెట్లపల్లి శ్రీనివాస్, పంపాటి శ్రీధర్, గుమ్మడవల్లి వెంకటేశ్వర్లు, మంచికంటి జగన్మోహన్,హెచ్చ శ్రీరాములు, అలంపల్లి ధనయ మరియు ఆర్యవైశ్యసోదరులు, యువకులు పాల్గొన్నారు