మహాశతఛండీయాగాన్ని నిర్వహించిన కేసీఆర్ దంపతులు
రంగారెడ్డి,డిసెంబర్3(జనంసాక్షి): ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో నిర్వహిస్తున్న మహాశత చండీయాగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. వర్షాల కోసం భారీ ఎత్తు చేపట్టిన ఈ యాగం గత కొంత కాలంగా సాగుతోంది. గురువారం సిఎం కెసిఆర్ దంపతలతో పాటు పలువురు, ప్రజాప్రతినిధులు,అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలిమినేడులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పురోహితులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య చండీయాగం వైభవంగా కొనసాగుతుంది. వర్షాల కోసం చేపట్టిన ఈ యాగానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి రానున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు. బుధవారం నుంచే అధికారులు ఏర్పాట్లు చేశారు. బాంబు నిర్వీర్య బృందాలు యాగశాల, వ్యవసాయ క్షేత్రంలో అడుగడుగునా తనీఖీలు చేసి, ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముఖ్యమంత్రి హెలీక్‌య్టాపర్ దిగేందుకు యాగశాలకు వంద విూటర్ల దూరంలో హెలీప్యాడ్‌ను సిద్ధం చేసారు. కేసీఆర్‌ను కలుసుకోవడానికి మూడు వేల మంది వరకు వస్తారనే అంచనాతో చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వీఐపీలు, అతిథులు, ప్రజల కోసం గ్యాలరీలు ఏర్పాటుచేశారు.