మహా లక్ష్మి అవతారం లో కనకదుర్గ దేవి
వరంగల్ ఈస్ట్ , అక్టోబర్01(జనం సాక్షి)
ఈ రోజుదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఎస్ ఆర్ ఆర్ తోట కరీమాబాదు నందు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరవ రోజు జరిగినవి .అర్చకులు పాలకుర్తి ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో . ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారం లో దర్శనం ఇచ్చారు.ఉదయం అమ్మవారికి అభిషేకం, అమ్మవారు సన్నిధిలో ప్రతి రోజు పూజలతో పాటు హోమాలు నిర్వహించ బడినవి దేవాలయ కమిటీ అధ్యక్షులు ,కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.