మహిళను వేదిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాదాద్రి భువనగిరి,జూన్26(జనం సాక్షి): ఓ మహిళను తరచూ ఫోన్ ద్వారా వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈసంఘటన యాదాద్రి జిల్లా ఆలేరులో జరిగింది. స్థానిక ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన గూండాల చంద్రం ఆలేరు మండలానికి చెందిన ఓమహిళకు కొంతకాలంగా ఫోన్‌చేస్తూ వేధిస్తున్నాడు. ఈవిషయమై బాధిత మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ ఆ సెల్ నెంబర్‌పై నిఘా ఉంచి చంద్రంను అరెస్టు చేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.