మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.