మహిళలకు ఉచితకుట్టు శిక్షణ,శిక్షణతో పాటు కుట్టు మిషన్ పంపిణీ,ఉద్యోగ కల్పన

జనం సాక్షి,చెన్నరావు పేటనర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, సెట్విన్, న్యాక్ , గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సమన్వయంతో చెన్నారావుపేట మండలంలో ఆసక్తి, అర్హత, కలిగిన మహిళా సభ్యులకు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని,దీనికోసం మండలంలోనే 10శిక్షణ యూనిట్ల ను ఏర్పాటు చేసి ప్రతి యూనిట్ కేంద్రంలో 50 మంది లబ్ధిదారులకు శిక్షణ అందించడం జరుగుతుందని, శిక్షణ అనంతరం సర్టిఫికెట్,ఉచిత కుట్టు మిషన్ తో పాటుగా,టెక్స్ టైల్ పార్కులో రిక్రూమెంట్ కల్పించడం జరుగుతుందని,ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి చెన్నారావుపేట మండల మహిళలు అధిక సంఖ్యలో ముందుకు రావాల్సిందని, గ్రామీణ పేదల ఉద్యోగ కల్పనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, శిక్షణ కోసం లేబర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, పదవ తరగతి పాసైన మహిళా సభ్యులు దీనికి అర్హులని దరఖాస్తు ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమైనవని, ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉంటే మీ గ్రామ పరిధి లో వి ఓ ఏ లకు,సి సి లకు, మండల సమైక్య కార్యాలయంలో నేరుగా సంప్రదించి గాని, మీ గ్రామ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకుని కానీ, లబ్ధి పొందవలసిందిగా ఏపిఎం ఈశ్వర్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఎవరికి ఎటువంటి దరఖాస్తు రుసుములు కానీ, అమౌంట్ గాని, ఇవ్వవలసిన పనిలేదని ఈ కార్యక్రమము నియోజకవర్గ మహిళల కోసం పూర్తి ఉచితంగా, పారదర్శకంగా, ప్రయోగపూర్వకంగా ఎమ్మెల్యే చేపట్టారని ఈ సందర్భంగా తెలిపారు.