మహిళలకు బాలికలకు అండగా భరోసా సెంటర్ సేవలు
బాధితుల్లో భరోసాను కలిగిస్తున్న సిద్దిపేట భోరోసా సెంటర్
లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పిండంతో పాటు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం పూర్తి సహయ సహకారాలను అందిస్తుంది
అడిషనల్ డిసిపి అడ్మిన్ యస్. మహేందర్
సిద్దిపేట బ్యూరో నవంబర్ 21( జనం సాక్షి )భరోసా, సెంటర్ సిబ్బందితో మహిళల మరియు బాలల రక్షణ గురించి సత్వర సేవలు అందించడానికి తీసుకుంటున్న చర్యల గురించి మరియు అందిస్తున్న సేవల గురించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం రోజు సిద్దిపేట భరోసా సెంటర్ లో అడిషనల్ డిసిపి యస్. మహేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.భరోసా సెంటర్ లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు కేసులలో భరోసా సెంటర్ ద్వారా చేసిన సహాయ సహకారాలు మరియు ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి మాట్లాడుతూ బాధితుల్లో భరోసాను కలిగిస్తున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం, లైంగిక దాడులకు గురైన బాధితులకు బరోస కల్పిండంతో పాటు వారికి పూర్తి సహయ సహకారాలను అందిస్తుంది తెలిపారు, భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించడం జరుగుతుందన్నారు. మరియు జిల్లాలో ఎక్కడైనా పోక్సో మరియు అత్యాచారం కేసులు జరగగానే సంబంధిత బాధితులను నేరుగా భరోసా సెంటర్ కు సంబంధిత అధికారులు తీసుకొని రాగానే చట్ట ప్రకారం వారికి అందించవలసిన సూచనలు సలహాలు తక్షణమే అందించాలని భరోసా సిబ్బందికి సూచించారు,
మరియు వారికి కావలసిన సహాయ సహకారాలు న్యాయపరంగా సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు,పోక్సో మరియు అత్యాచార కేసుల్లో బాధితులకు త్వరగా కాంపెన్సేషన్ ఇప్పించడానికి వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. కాంపెన్సేషన్ రాని కేసులను లిస్ట్ ఔట్ చేయాలని మహిళా ఇన్స్పెక్టర్ శ్రీమతి ఏబి దుర్గ కు సూచించారు. భరోసా సెంటర్ సేవల గురించి సంబంధిత బాధితులు డయల్ 100, లేదా సిద్దిపేట జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8333998699 నెంబర్ కు ఫోన్ చేసి సహాయ సహకారాలు పొందవచ్చని సూచించారు. భరోసా కేంద్రంలో ఈరోజు వరకు 57 ఫోక్సో కేసులు, 18 రేప్ కేసులు, మొత్తం 75 మంది బాధితులకు భరోసా కల్పించడం జరిగిందని మరియు ప్రాసిక్యూషన్ సమయంలో కూడా బాధితులకు న్యాయపరమైన సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ప్రతి నెల భరోసా సెంటర్ లో వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో మహిళల బాలలకు సంబంధించిన కేసులో పురోగతి ప్రభుత్వం తరపున రావలసిన సహాయ సహకారాలు గురించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ.బి. దుర్గ, భరోసా సెంటర్ సిబ్బంది సౌమ్య, సోని, హరిత, భవాని, తదితరులు పాల్గొన్నారు.