మహిళలకు భద్రత లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి:ఎంపీ కవిత
మహిళలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ కవిత అన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీ టీంలు ఏర్పాటుచేసి నేటితో ఏడాది పూర్తయిన ఈ సందర్భంగా శిల్పారామం లో నగరంలో నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. మహిళలు, విద్యార్థినులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంలో షీ టీంలు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని అన్నారు. ఆకతాయిల బెడద, ఇతరాత్ర ఇబ్బందులను షీటీం దృష్టికి తీసుకరావాలని సూచించారు. ర్యాలీలో సినీ నటి జయసుధ, పోలీస్ అధికారులు విద్యార్థినులు పాల్గొన్నారు.