మహిళలను గౌరవించడం మన తెలంగాణ సంస్కృతి :గొల్ల రాములు

జహీరాబాద్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి ) మహిళలను గౌరవించడం మన తెలంగాణ సంస్కృతి అని గొల్ల రాములు అన్నారు. మంగళవారం కోహిర్ మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు.,తెలంగాణ అక్కాచెల్లెళ్లు,ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం అంటే తెలంగాణ తల్లిని గౌరవించుకోవడంతో సమానమని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, పిఎసిఎస్ డైరెక్టర్ గొల్ల రాములు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మహిళల సంక్షేమం కొరకు కెసిఆర్ కిట్, కళ్యాణలక్ష్మి ,షాదీముబారక్, ఒంటరి మహిళల పెన్షన్,షీ టీమ్స్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం తెలంగాణ పౌరులుగా మన అదృష్టం అన్నారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దతోట రాములమ్మ,కొత్తూర్ సర్పంచ్ గాండ్ల కల్పన,పంచాయతీ కార్యదర్శులు నరేష్,రాజు నాయక్,ఖానాపూర్ గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు కటికె నర్సింలు,ఉపాధ్యక్షులు కవేలి అశోక్,టిఆర్ఎస్ నాయకులు పెద్దతోట రాచన్న,గాండ్ల సిద్ధప్ప, జుంపాల సైదులు,జానమ్మ గారి మోహన్ రెడ్డి,మహిళలు బర్ల లక్ష్మమ్మ,జుంపాల నర్సమ్మ,ఎక్కెల్లి తుల్జమ్మ,పెద్దతోట నర్సమ్మ,తొంట నాగమ్మ,కటికె జనమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.