మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మహిళలు బ్యాంకు రుణాలు  సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఐకెపి ఏపీఎం బాలకృష్ణ అన్నారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో మహిళ మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండల పరిధిలో ని ఆయా గ్రామాల్లో ని మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ  మహిళలు ఆర్థికంగా అభివృద్ధి లో  భాగంగా బ్యాంకు లో ఇచ్చిన అప్పులను వినియోగించుకొని  తిరిగి సకాలంలో అప్పు  చెల్లించాలి అన్నారు. మహిళ సంఘం లో ఉన్న కుటుంబం లో ఉన్న నిరుద్యోగుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిసి లు మల్లేశం శ్రీనివాస్ రెడ్డి, నర్సమ్మ, యాదగిరి, అనిత మండల సమ్యఖ్య సంఘం అధ్యక్షులు కార్యదర్శి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.