మహిళలు ఆర్దికంగా ఎదగడానికి కుట్టు శిక్షణా కేంద్రాల ఏర్పాటు

మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్దికంగా
నిలబడటానికి ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక ప్రకాష్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని 36వ వార్డులో గండూరి ప్రీతమ్ జోనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఐదు చోట్ల తమ కుమారుడు గండూరి ప్రీతమ్ జోనా జ్ఞాపకార్థం కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.కుట్టు శిక్షణ పొందిన  మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్దికంగా నిలబడాలని అన్నారు.కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారు బ్యాంకుల నుండి రుణ సదుపాయం పొందాలన్నారు.కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పలు సంక్షేమ పధకాలు అమలు చేస్తుందని అన్నారు. జోనా ఫౌండేషన్ ద్వారా బాడ్మింటన్, వాలీబాల్ క్రీడాకారులకు కిట్స్ అందజేసినట్లు చెప్పారు.అవసరమున్న ప్రతి చోటా జోనా ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తామని, పట్టణంలో ప్రతి వార్డులో మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత 25 సంవత్సరాల నుండి తనను గెలిపిస్తున్న 36వ వార్డు ప్రజలకు ధన్యవాదములు తెలిపారు.తమ కుమారుడు ప్రీతమ్ జోనా జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ , నాయకులు ఆకుల లవకుశ, బైరు వెంకన్న, వార్డు అధ్యక్షులు  రాచకొండ కృష్ణ ,టైసన్ శ్రీను, గుడిసె శేఖర్, రామ్మూర్తి,  ప్రతాప రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.