మహిళలు చైతన్యవంతమై పోరాడాలి

4
– జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సదస్సులో కడియం శ్రీహరి

హైదరాబాద్‌: దేశం విద్యా రంగంలో అనేక సమస్యలను ఎదుర్కుంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ ఆయన నగరంలోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఉమెన్‌ టీచర్స్‌ నేషనల్‌ కన్వెన్షన్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విద్యా వ్యవస్థ పటిష్టతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తీర్చి దిద్దేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు ఎడ్యుకేషన్‌ పాలసీపై దృష్టి సారించాలన్నారు. డిటెన్షన్‌ పద్దతికి ప్రభుత్వం వ్యతిరేకమని తెలిపారు. ఈ విధానం వల్ల నష్టపోయేది ఎక్కువగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని వెల్లడించారు. ప్రైవేట్‌, ప్రభుత్వం విద్యా సంస్థల మధ్య పోటీ నెలకొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆడపిల్లలను చదువు వైపు ప్రోత్సహించే విధంగా ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలన్నారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 3 లక్షల మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారని తెలిపారు. మహిళలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫిెసర్‌ సూరేపల్లి సూజాత మాట్లడుతూ మహిళల పై అడుగడుగున  వివక్ష ఉందని అందుకు మహిళా ఉపాధ్యాయులు మినహింపు కాదన్నారు. సావిత్రిబాయి ఫూలే చూపిన మార్గంలో మహిళ ఉపాద్యాయులు పోరాడాలని ఆమె పిలుపు నిచ్చారు.