మహిళలు వేసిన రంగవల్లుల్లో స్వతంత్ర స్ఫూర్తిని జాతీయ భావాన్ని తెలియజేశారు : జడ్పి చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 : స్వతంత్ర స్ఫూర్తిని, జాతీయ భావం  పెంపొందించే విధంగా ప్రతి ఒక్క మహిళ రంగవల్లులను అద్ది ప్రజలలో చైతన్యము కల్పించారని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత  తిరుపతయ్య అన్నారు. శనివారం 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ముగ్గుల పోటీలను పరిశీలించి ఉత్తమంగా ఎంపికైన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8 నుండి 22 వరకు నిర్వహించిన వజ్రోత్సవాల కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో మహిళలు ముందంజలో ఉండి స్వాతంత్ర స్ఫూర్తిని , జాతీయ బావం  పెంపొందించే విధంగా రంగవల్లులు తీర్చి దిద్దారని  అన్నారు.  ముగ్గుల పోటీలలో ప్రతి ఒక్క మహిళ పోటీపడ్డారని, ఇందులో గెలుపొందిన వారిని వారు అభినందించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భావితరాల వారికి గుర్తుండే విధంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి స్వతంత్ర స్ఫూర్తిని కలిగించే  విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం పట్ల మహిళలను అభినందించారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి  ఒక్కరికి బహుమతులు  ప్రధానం  చేసారు.  ముగ్గుల పోటీలలో  న్యాయ  నిర్నే తలుగా జడ్పీ సీఈవో  విజయనాయక్, డి పి ఆర్ ఓ చెన్నమ్మ,  సంక్షేమ శాఖ అధికారి  ముసాయిదా బేగం, డీఎస్ఓ రేవతి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమీషనర్ జానకి రామ్  సాగర్,  రైస్ మిల్లర్లు పాండు, సుదర్శన్, శేషన్న, మహిళలు,  తదితరులు పాల్గొన్నారు.