మహిళలు సఖి వన్ స్టాప్ సెంటర్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి

మహిళలు మరియు బాలికలపై హింస వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ప్రచారం సందర్భంగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించడంలో భాగంగా ఈరోజు కల్వకుర్తి పెద్దాపూర్ వెల్దండ గ్రామాలలో  నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా స్టాప్ అయిన టీ సరిత లీగల్ కౌన్సిలర్ మరియు ఎం సునీత పారామెడికల్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, ఆర్థిక స్వాతంత్రము, మరియు విద్య ఎక్కువ అభ్యసించడం వలన మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చని  చెప్పారు. అదేవిధంగా మహిళలు  గృహింస లాంటి సమస్యలకు గురి అయినప్పుడు సఖి వన్ స్టాప్ సెంటర్ అందించే ఐదు రకాల సేవలను ఉమెన్ హెల్ప్ లైన్ 18 ద్వారా కానీ మరియు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న సఖి ఆఫీస్ ను సంప్రదించడం ద్వారా కానీ నివారించుకోవచ్చు అని మహిళలకువివరించారు.