మహిళల భద్రతే” సఖి ” లక్ష్యం
గద్వాల రూరల్ జూన్ 07 (జనంసాక్షి):- గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని మార్లబీడు, ధరూర్ గ్రామాలలో జాతీయ ఉపాధి హామీ కూలీలకు మరియు మహిళలు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది,ఈ కార్యక్రమంలో సందర్భంగా సఖి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సఖి సిబ్బంది సరస్వతీ, మారియ మాట్లాడుతూ సఖి ఉద్దేశ్యం గృహహింస వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, పని చేసే చోట లైంగిక వేధింపులు ఆడపిల్లల అమ్మకం అక్రమ రవాణా, నివారణ వంటివాటిపై సఖి కేంద్రం పని చేస్తోందని తెలిపారు,బాధిత మహిళలకు సఖి కేంద్రం అందించే 5 రకాల ఉచిత సేవలు1. వైద్య సహాయం 2.కౌన్సిలింగ్ 3.పోలీసు సహాయము 4.న్యాయ సహాయము 5.తాత్కాలిక వసతి – మూడు రోజుల నుండి 5 రోజుల వరకు అవసరమైనచో 7 రోజులు అందించబడును.
మహిళలు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గృహహింస నిరోధక చట్టం,
వరకట్న వేధింపుల నిరోధక చట్టం, నిర్భయ చట్టం, బాల్యవివాహాల నిరోధక చట్టం,చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం మరియు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం
సఖి సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది మహిళలు అమ్మాయిలు ఆపద సమయంలో ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181,100 సఖిల్యాండ్ లైన్ నెంబర్ 08546 – 272250 లను సంప్రదించగలరు. ఇందులో అందరికీ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది….