మహిళల సమస్యల సాధనకై ఉద్యమించండి
ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి
పానుగల్ అక్టోబర్ 07, జనంసాక్షి
మహిళల సమస్యల సాధనకై ఉద్యమించాలని ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ జ్యోతి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో జిల్లాస్థాయి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు ఏ గ్రామానికి వెళ్లి చూసిన బెల్టు మద్యం షాపులలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, మహిళలపై దాడులు కొనసాగుతున్నప్పటికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దాడులను అరికట్టడంలో విఫలమైందన్నారు. చట్టసభలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించి మహిళా హక్కుల సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా వనపర్తి జిల్లా కార్యదర్శి లక్ష్మి, మహిళా సంఘం జిల్లా నాయకురాలు సాయి నీల తదితరులు పాల్గొన్నారు.