*మహిళాభ్యున్నతికి ప్రభుత్వం కృషి*

*ఆగస్టు 15 నుంచి జిల్లాలో  26 వేల‌ మందికి కొత్తగా సామాజిక పెన్షన్లు*
సీయం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి రాఖీలు క‌ట్టిన మున్సిప‌ల్, ఐకేపీ, డీఆర్డీఏ మ‌హిళ ఉద్యోగులు, సిబ్బంది*
నిర్మ‌ల్ బ్యూరో, ఆగస్ట్12,  జనంసాక్షి,,,: తెలంగాణ‌లో మహిళాభివృద్ధి  కోసం సీఎం కేసీఆర్  అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.  టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేర‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆద్వ‌ర్యంలో శాస్త్రిన‌గ‌ర్ లోని క్యాంప్ ఆఫీస్ లో వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిప‌ల్, ఐకేపీ, డీఆర్డీఏ మ‌హిళ ఉద్యోగులు, సిబ్బంది, బ్రహ్మ‌కుమారీలు, మ‌హిళ ప్ర‌జాప్ర‌తినిదులు…. కేసీఆర్‌ చిత్రపటాలకు రాఖీలు క‌ట్టారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి జిల్లా పౌర సమాచార అధికారిని తిరుమల రాఖీ కట్టారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు …. మహిళల  సమగ్ర వికాసం, సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, కోసం అనేక పథకాలు అమలు చేస్తూ వారికి అడుగడుగునా పెద్ద‌న్న‌గా అండగా నిలుస్తున్నార‌ని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు కూడా పింఛన్లు ఇస్తున్నామని, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకునే రోగులకు కూడా కొత్త‌గా పింఛను ఇవ్వాలని సీయం కేసీఆర్  నిర్ణయించార‌ని తెలిపారు. స్వ‌తంత్ర భార‌త  వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 15 నుంచి  57 ఏళ్ల వయసు దాటిన అర్హులందరికీ  పెన్షన్లు ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. నిర్మ‌ల్ జిల్లాలో  ప్రస్తుతం1,50,207  మందికి పెన్షన్లు ఇస్తున్నామని, ఇప్పుడు  జిల్లా వ్యాప్తంగా కొత్తగా మరో 26, 254  వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని, దీంట్లో అర్హులైన‌ వారంద‌రికీ పెన్షన్లు ఇస్తామని తెలిపారు. దీంతో కొత్త‌వి, పాత‌వి క‌లిపి సుమారు 1,76, 461 మంది పెన్ష‌న్ దారుల‌కు కొత్త‌కార్డులు అంద‌జేస్తామ‌న్నారు. దీంట్లో నిర్మ‌ల్ నియోజ‌క‌వర్గంలో ప్ర‌స్తుతం  63,772  ఫించ‌న్లు ఇస్తుండ‌గా, కొత్త‌గా 10,061 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయని వెల్లడించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప్ర‌జాపరిష‌త్ చైర్ ప‌ర్స‌న్ కె. విజ‌య‌ల‌క్ష్మిరెడ్డి,  మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ టీఆర్ఎస్ అధ్య‌క్షులు మారుగొండ రాము, ఎఫ్ఎస్ సీఎస్  చైర్మ‌న్ ధ‌ర్మాజీ రాజేంద‌ర్,త‌దిత‌రులు పాల్గొన్నారు.