మహిళా రెజ్లర్ల పై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ కి మద్దతుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
జనం సాక్షి దుబ్బాక.PDSU సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేంద్రప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా PDSU సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యానాథ్ మాట్లాడుతూ ఏదైతే గత నెల రోజులుగా తమపై లైంగికంగా వేధిస్తున్నాడని బిజెపి ఎంపీ మరియు రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిడ్జ్ భూషణ్ కి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంలో గల జంతర్ మంతర్ వద్ద అలుపెరుగని పోరాటం చేస్తున్న మహిళ రెజ్లర్లలను నిన్నటి రోజున కొత్త పార్లమెంట్ భవనం ఎదుట వాళ్ళు చేస్తున్న శాంతియుత నిరసనను అడ్డుకొని వారినీ విచక్షణా రహితంగా లాకెళ్లి అరెస్టు చేయడానికి మరియు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి PDSU సిద్దిపేట జిల్లా కమిటీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఈ దేశ గౌరవాన్ని జాతీయ పతాకాన్ని ప్రపంచ నలుమూలలకు స్పోర్ట్స్ రూపకంగా వ్యాపింప చేసినటువంటి ఈ మహిళా క్రీడాకారిణులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిల్వకపోవడాన్ని వారి సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామని అదేవిధంగా మహిళల రెజ్లర్ల పై లైంగిక దాడులకు పాల్పడిన ఎంపీ బ్రిడ్జ్ భూషణ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మహిళా రెజ్లర్లకు అండగా ప్రభుత్వం నిలబడాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రదీప్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రణయ్, హిమవంతు కృష్ణులు మరియు పట్టణ కమిటీ నాయకులు లక్ష్మణ్, కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు.