మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా. మండల మహిళా సమాఖ్య నూతన అధ్యక్షురాలు సుజాత
కోటగిరి ఆగస్టు 25 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండల కేంద్రంలోని స్త్రీనిధి కార్యాలయంలో గురువారం రోజున 16 వ మండల మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో కోటగిరి మండల నూతన మహిళా సమాఖ్య పాలక వర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.అలాగే ఈ సమావేశంలో ఐ.కే.పి ఏ.పి.యం బస్వంత్ రావు మాట్లాడుతూ.గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలు చదివి వినిపించారు.స్త్రీ నిధి సభ్యులకు ఇచ్చిన రుణాలు వందకు 100 శాతం రికవరీ అయ్యాయన్నారు.కోటగిరి మండల స్త్రీ నిధి లావాదేవీలో నిజామాబాద్ జిల్లాలో రెండోవ స్థానంలో ఉందన్నారు.అలాగే పాలకవర్గ సభ్యుల యొక్క విధులు,బాధ్యతలను తెలియజేశారు.
అనంతరం నిజామాబాద్ జిల్లా స్త్రీనిధీ రీజినల్ మేనేజర్ రాంధాస్ మాట్లాడుతూ.స్త్రీ నిధి ద్వారా సభ్యులకు 150 రకాల కార్యక్రమాలకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ స్త్రీ నిధి ద్వారా మహిళా సమాఖ్య సభ్యులందరికీ 5 వేల నుండి 5 లక్షల వరకు వారి జీవనోపాధి కోసం రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.స్త్రీ నిధికి సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ పథకాల గూర్చి స్ట్రీనిధి సభ్యులకు క్లుప్తంగా వారు వివరించారు.అనంతరం మండల మహిళ సమాఖ్య నూతన పాలక వర్గ సభ్యుల ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి ప్రత్యక్షంగా ఎన్నిక జరపగా ఈ ఎన్నికలలో మండల మహిళా సమాఖ్య నూతన అధ్యక్షురాలుగా బాకర్ ఫారం గ్రామానికి చెందిన సుజాత ఎన్నిక కాగా,ఉప అధ్యక్షురాలుగా సునిత,కార్యదర్శి రజినీ,సహాయ కార్యదర్శి సావిత్రి,కోశాధికారి భాగ్య శ్రీ లకు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికైన నూతన పాలకవర్గ సభ్యులచే మండల మహిళా సమాఖ్య ఏ.పి.యం బస్వంత్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు.తదనంతరం స్వాతంత్ర వజ్రోస్థవాలలో భాగంగా మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అతరుద్దిన్,ఎ.పీ.ఓ రమణ,
ఎస్.బి.ఐ కోటగిరి, పోతంగల్ శాఖ మెనేజర్స్ రోషిధ్ రాం,నరేష్,దక్కన్ గ్రామీణ బ్యాంక్ హెగ్డోల్లి శాఖ మేనేజర్ వంశీ కృష్ణ, కోటగిరి ఎన్.డి.సి.సి.బి బ్యాంక్ మేనేజర్ వెంకటేష్ రావు,ఐ.కే.పి సిబ్బంది సి.సిలు గంగారాం, సాయిబాబు, సాయిబాబా, యం.ఎస్.సి.సిలు విఠల్,రమాదేవి,సుజాత,రమేష్, ఏకౌటెంట్ రాజు,అసిస్టెంట్ మేనేజర్ సుభాష్,
అటెండర్ సాయిలు,గ్రామ సంఘాల ప్రతినిధులు,
మహిళలు,తదితరులు పాల్గొన్నారు.